- రోడ్లు వేయాలని, వసతులు కల్పించాలని డిమాండ్
వరంగల్ సిటీ, వెలుగు : కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టూడెంట్లు గురువారం ఆందోళన చేశారు. ర్యాలీ గా వెళ్లి, ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ ను కలిశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం జాయింట్ సెక్రటరీ నవదీప్ మాట్లాడుతూ రోడ్డు గుంతలు తేలి ఉండటంతో వాహనాలు కిందపడి ముగ్గరు విద్యార్థులకు గాయాలు అయినట్లు చెప్పారు.
ఇందులో విద్యార్థులు ఉంటున్న హాస్టల్లో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇటీవల కలెక్టర్ ను కూడా కలిసి వివరించినట్లు తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ కు వివరించినట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్ తెలిపారు. మంత్రులకు విషయం చెప్పానని, త్వరలోనే సమస్యలు తీరుతాయని ఆయన తెలిపారు.