నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పిల్లికుంట్ల తండా జీపీ పరిధిలోని జువ్వి పోచమ్మ తల్లి తండా రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో స్టూడెంట్స్స్కూలుకు వెళ్లేందుకు తిప్పలు పడుతున్నారు.
తల్లి దండ్రులు బైక్ మీద దింపి వద్దమన్నా, ఆటోలో పంపిద్దామన్నా వీలు కాని పరిస్థితి ఉందని తండా వాసులు ఆరోపిస్తున్నారు. సోమవారం బురద రోడ్డు లో ఇబ్బందులు పడుతూ వెళ్తూ స్టూడెంట్స్రోడ్డు వేయించాలని సీఎంని కోరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.