మాకు టీచర్లు కావాలి.. స్కూల్ బయట విద్యార్థుల ఆందోళన

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో టీచర్ల కోసం విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ టీచర్లు లేక 10వ తరగతి క్లాసులు జరగడం లేవని తెలిపారు. విద్యా సంవత్సరం పూర్తికావస్తున్నా టీచర్లు లేక.. క్లాసులు జరగకపోవడవంతో తామంతా ఆ సబ్జక్ట్ లపై పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు.

మంగళవారం 2023 డిసెంబర్ 5న క్లాసులు బైకాట్ చేసి.. స్కూల్ బయట ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్లు లేక ఆ సబ్జక్ట్ లు చదవలేకపోతున్నామని.. వెంటనే ఆయా సబ్జక్ట్ టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఎస్ఎమ్ సీ చైర్మెన్ శ్రీనివాస్ చారి మద్దతు తెలిపారు. కాగా టీచర్ల నియామకానికి రెండు సార్లు నోటిఫికేషన్ వేసినా స్పందన రాలేదని ప్రిన్సిపల్ లావణ్య తెలిపారు.