విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

ఆసిఫాబాద్/జన్నారం, వెలుగు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. 67 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆదర్శ బాలికల పాఠశాల గ్రౌండ్​లో బుధవారం రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. 

ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు కుంగిపోకుండా మళ్లీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా పరిశీలకులు రామయ్య, రమేశ్, డీఎస్ఓ మీనారెడ్డి, ఎస్ జీఎఫ్ సెక్రటరీ సాంబశివరావు, సింగల్ విండో చైర్మన్ ఆలీ బీన్ అహ్మద్, ఏఎంసీ మాజీ చైర్మన్ గంధం శ్రీనివాస్, డీఎస్పీ వెంకటరమణ, సీఐ రాజు, ఏసీఎంవో ఉద్ధవ్ తదితరులు పాల్గొన్నారు. 

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని మంచిర్యాల డీఈవో  సిగసారపు యాదయ్య అన్నారు. జన్నారం మండలంలోని కలమడుగు గవర్నమెంట్ హైస్కూల్​లో మండల స్థాయి వాలీబాల్, టెన్నికాయిట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని తెలపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయ్ కుమార్, సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ కమలాకర్, మండలంలోని 13 హైస్కూళ్లకు చెందిన హెచ్​ఎంలు, పీఈటీలు పాల్గొన్నారు.