
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్జూనియర్ కాలేజీలో కనీస వసతుల్లేక స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఆరు క్లాస్రూమ్స్ఉండగా, మూడు మీడియంలకు సంబంధించి 460 మంది చదువుతున్నారు. తెలుగు మీడియం మొదటి, రెండో సంవత్సరంతో కలిపి 238 మంది, ఇంగ్లీష్ మీడియంలో 118 మంది, ఉర్దూ మీడియంలో 94 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. పదేండ్ల కింద ఆరు గదులతో బిల్డింగ్నిర్మించగా, విద్యార్థుల సంఖ్య పెరగడంతో పక్కనే రూ.2.20 కోట్లతో మరో బిల్డింగ్కోసం ప్రభుత్వం ఫండ్స్మంజూరు చేసింది. అయితే ఫండ్స్రిలీజ్కాక నిర్మాణం మధ్యలోనే ఆగింది. ఒక ఫ్లోర్ కు పిల్లర్లు, స్లాబ్మాత్రమే వేశారు.
దీంతో ఉన్న గదులు సరిపోక విద్యార్థులు ఆరు బయట, మెట్లపై, స్లాబ్‌కింద కూర్చొని చదువుకుంటున్నారు. ఉర్దూ మీడియానికి సంబంధించి ఒకే గదిలో రెండు క్లాసులు నిర్వహిస్తున్నారు. ల్యాబ్లేకపోవడంతో ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టూడెంట్ల పరికరాలను బీరువాలో పెట్టుకుంటున్నారు. కొన్ని సెక్షన్లకు బెంచీలు లేవు. దీంతో కింద కూర్చుంటున్నారు. స్కావెంజర్లేకపోవడంతో ప్రిన్సిపాల్వెంకటేశ్వరరావు నెలకు రూ.3 వేలు తన సొంత ఖర్చుతో మెయింటెనెన్స్చేయిస్తున్నారు.
ఇటీవల విద్యార్థులు తమ సమస్య పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 460 మంది విద్యార్థులకు కనీసం 23 గదులు కావాల్సి ఉందన్నారు. ఆరు మాత్రమే ఉండడంతో కష్టాలు పడుతున్నామన్నారు. కొత్త బిల్డింగ్నిర్మాణం పూర్తయితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.