మంచిర్యాల గిరిజన స్కూల్​లో.. 12 మంది స్టూడెంట్లకు అస్వస్థత

మంచిర్యాల గిరిజన స్కూల్​లో.. 12 మంది స్టూడెంట్లకు అస్వస్థత

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల సాయికుంటలోని ట్రైబల్​ వెల్ఫేర్​ గర్ల్స్​ రెసిడెన్షియల్​ స్కూల్​లో బుధవారం 12 మంది టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​ అస్వస్థతకు గురయ్యారు. స్కూల్​లో  ఉన్న160 మంది స్టూడెంట్లు ఉదయం కిచిడి తిన్నారు. ఇందులో ఒకే  క్లాస్​కు చెందిన 12 మందికి కడుపులో తిప్పడం, ఒకరిద్దరికి వాంతులు కావడంతో వెంటనే మంచిర్యాల గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​కు తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్​ కుమార్​ దీపక్​ హాస్పిటల్​కు వెళ్లి స్టూడెంట్ల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్యనిపుణుల పర్యవేక్షణలో వారికి మెరుగైన ట్రీట్​మెంట్​ అందిస్తున్నామని తెలిపారు. 

స్కూల్​లో హెల్త్​ క్యాంప్​ ఏర్పాటు చేసి మిగిలిన విద్యార్థుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఫుడ్​ సేఫ్టీ అధికారుల ద్వారా విద్యార్థులకు పెట్టిన ఫుడ్, వాటర్​ శాంపిల్స్, స్టూడెంట్లు ఇండ్ల నుంచి తెచ్చుకున్న పచ్చళ్ల శాంపిల్స్​ను టెస్టుల కోసం ల్యాబ్​కు పంపామని తెలిపారు. హాస్టల్​లో ఆర్వో వాటర్​నే తాగుతున్నారని, ప్రస్తుతం స్టూడెంట్ల పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఫుడ్​ పాయిజన్​ జరిగినట్లు తేలితే బాధ్యులపై యాక్షన్​ తీసుకుంటామని స్పష్టం చేశారు.