విద్యార్థులకిచ్చే ఫుడ్ లో క్వాలిటీ పాటించండి

  • ట్రైబల్ హాస్టల్స్ ప్రిన్సిపాల్స్, 
  • వార్డెన్లతో ట్రైబల్ సెక్రటరీ శరత్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ హాస్టల్స్ స్టూడెంట్స్ కు అందించే ఫుడ్ లో క్వాలిటీ మెయింటెన్ చేయాలని అధికారులను ఆ శాఖ సెక్రటరీ శరత్ ఆదేశించారు. వండిన వెంటనే స్టూడెంట్స్ కు వడ్డించాలన్నారు. గురువారం సెక్రటేరియెట్ నుంచి ఐటీడీఏ పీవోలు, డిస్ర్టిక్ ట్రైబల్ ఆఫీసర్లు, ఆర్సీవోలు, ప్రిన్సిపాల్స్, హెచ్ఎంలు, వార్డెన్లతో సెక్రటరీ శరత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూర.. స్టూడెంట్స్ హెల్త్ పై హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వంటల్లో క్వాలిటీ సరుకులనే ఉపయోగించాలని స్పష్టం చేశారు.  క్వాలిటీ లేని సరుకులను కాంట్రాక్టర్లకు తిప్పి పంపాలని ఆదేశించారు. తాగు నీరు శుభ్రంగా ఉండాలని, వంట చేసే ఏరియా క్లీన్ గా ఉంచాలన్నారు. ఈ అంశాలపై అలసత్వం ప్రదర్శిస్తే అధికారులపై చర్యలు తప్పవని శరత్ హెచ్చరించారు.

 స్టూడెంట్స్ హెల్త్ పై యాప్ లో వివరాలు అప్ డేట్ చేయాలని, కమాండ్  కంట్రోల్ సెంటర్ నుంచి మానిటర్ చేస్తామన్నారు. ఈ రివ్యూలో ట్రైబల్ అడిషనల్  డైరెక్టర్ లు  సర్వేశ్వర్ రెడ్డి, సముజ్వల అడిషనల్ సెక్రటరీ  మాదవిదేవి, చందన, ట్రైకార్ జీఎం శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.