నవీపేట్, వెలుగు : నవీపేట్ మండల కేంద్రానికి చెందిన లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ స్టూడెంట్స్ ప్రతిభ కపబరిచి రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఎస్జీఎఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి లో శుక్రవారం జిల్లాస్థాయి నెట్ బాల్ టోర్నమెంట్ అండ్ సెలెక్షన్స్ నిర్వహించారు.
ఈ పోటీల్లో విద్యార్థినులు నిత్యా రెడ్డి, లాస్య ప్రతిభ కనబరచడంతో రాష్ట్ర స్థాయి నెట్ బాల్ కు ఎంపిక చేసినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులను కరెస్పాండెంట్ హన్మాండ్లు, పీఈటీ, టీచర్స్, తదితరులు అభినందించారు.