చదువు కోసం సాహసం.. ప్రమాదకరంగా బాలల ప్రయాణం

చదువు కోసం సాహసం.. ప్రమాదకరంగా బాలల ప్రయాణం

స్కూలుకు వెళ్లాలంటే.. విద్యార్థులు సాహసమే చేయాల్సి వస్తోంది. ఓ నదిని దాటడానికి వారు పడవలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చిన్నారులు వెళుతున్న పడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరిమితికి మించి పడవలో వాళ్లు ప్రయాణిస్తుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. వెంటనే వీరి సమస్యను పరిష్కరించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. వంతెన లేకపోవడమే కారణమని వెల్లడిస్తున్నారు. ఈ ఘటన అస్సోంలో చోటు చేసుకుంది. 
అసోంలోని Nalbari జిల్లాలో పలు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. విద్యార్థులు సమీపంలో ఉన్న పాఠశాలలో చదువుకొంటున్నారు. అయితే.. వీరు పాఠశాలకు వెళ్లాలంటే.. బ్రహ్మపుత్ర ఉపనది ఉంది. ఈ నది దాటాలంటే.. వారంతా పడవలను ఆశ్రయిస్తున్నారు.
 

ఓ పడవపై పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. ఓ విద్యార్థే స్వయంగా పడవ నడుపుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తోంది. ప్రాణాలు ఫణంగా పెట్టి.. ప్రయాణిస్తున్న విద్యార్థుల వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. విద్యార్థులే కాకుండా ఇతరులు వేరే ప్రాంతానికి వెళ్లాంటే పడవలను ఆశ్రయించాల్సిందే. వంతెన ఏర్పాటు చేస్తే.. వీరి సమస్యలకు చెక్ పడుతుందని పలువురు వెల్లడిస్తున్నారు. బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటే.. ఇంతవరకు అది కార్యరూపం జరగకపోవడంతో నది దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రమాదం జరగక ముందే.. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 
 



మరిన్ని వార్తల కోసం : -

సోలో వెడ్డింగ్కు సిద్ధమైన గుజరాత్ యువతి


కోతుల మధ్య ఆప్యాయత..మనషులను మించి..