ఇంటర్​ ఫలితాల్లో మేడ్చల్, రంగారెడ్డి హవా

ఇంటర్​ ఫలితాల్లో మేడ్చల్, రంగారెడ్డి హవా
  • ఫస్ట్ ఇయర్​లో మేడ్చల్​టాప్, సెకండ్​ఇయర్​లో థర్డ్​ప్లేస్​ 
  • రంగారెడ్డికి రెండు, నాలుగు స్థానాలు  
  • వెనకబడ్డ హైదరాబాద్, వికారాబాద్
  • గత ఏడాదితో పోలిస్తే కాస్త బెటరే 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇంటర్​ఫలితాల్లో మేడ్చల్– మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు.హైదరాబాద్​స్టూడెంట్లు​ఫస్ట్​ఇయర్​లో ఫర్వాలేదనిపించినా, సెకండియర్​లో వెనకబడ్డారు. వికారాబాద్​జిల్లాదీ ఇదే పరిస్థితి. మొత్తంగా చూస్తే అమ్మాయిలు అదరగొట్టారు. మేడ్చల్– మల్కాజిగిరి​జిల్లాలోని ఫస్ట్​ఇయర్​స్టూడెంట్లు జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో కలిపి 77.21 శాతం మంది, సెకండ్​ఇయర్​స్టూడెంట్లు 77.91 శాతం మంది పాస్​అయ్యారు.

ఫస్ట్​ఇయర్​ఫలితాల్లో మేడ్చల్ జిల్లా స్టేట్​నంబర్​వన్​స్థానంలో నిలిచింది. సెకండ్​ఇయర్​లో మూడో స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా 76.36 శాతంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవగా, రెండో సంవత్సరంలో 77.63 శాతంతో స్టేట్​లో ఫోర్త్​ప్లేస్​సాధించింది. హైదరాబాద్ జిల్లా మొదటి సంవత్సరంలో 66.68 శాతంతో ఏడో స్థానంలో నిలవగా, సెకండ్​ఇయర్​లో 67.74 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. వికారాబాద్​జిల్లా ఫస్ట్​ఇయర్​లో 61.31 శాతంతో 12వ స్థానంలో నిలవగా, సెకండ్​ఇయర్​లో 68.20 శాతంతో 21 స్థానంతో సరిపెట్టుకుంది.  

హాజరైంది ఎంత.. పాసయ్యింది ఎంత? 

మేడ్చల్​జిల్లాలో 68,650 మంది ఫస్ట్​ఇయర్​పరీక్షలు రాయగా, 53,003 మంది విద్యార్థులు పాస్​అయ్యారు. 62,539 మంది సెకండ్​ఇయర్​పరీక్షలు రాయగా, 48,726 మంది ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లాలో 80, 412 మంది ఫస్ట్​ఇయర్​ఎగ్జామ్స్​రాయగా, 61,406 మంది, సెకండ్​ఇయర్​లో 70, 581 మందికి గానూ 54,721 మంది పాసయ్యారు. హైదరాబాద్​లో 85,772 విద్యార్థులు ఫస్ట్​ఇయర్​పరీక్షలు రాయగా 57,197 మంది, సెకండ్​ఇయర్​లో 74,781 మంది ఎగ్జామ్స్​రాయగా 50,659 మంది పాస్​అయ్యారు. వికారాబాద్​జిల్లాలో 7,914 మంది ఫస్ట్​ఇయర్​పరీక్షలు రాయగా 4,852 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్​లో 6,789 మందికి గానూ 4,630 మంది పాసయ్యారు.  

కిందటేడుతో పోలిస్తే బెటర్​

కిందటి ఏడాదితో పోలిస్తే మొదటి సంవత్సర ఫలితాల్లో మేడ్చల్​జిల్లా మెరుగు పడింది. గతేడాది 71శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ఈసారి పాస్​పర్సంటేజ్​77.21 శాతంగా నమోదైంది. సెకండ్​ఇయర్​లో గతేడాది 79 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి రెండు శాతం తగ్గింది. రంగారెడ్డి జిల్లా గతేడాది ఫస్ట్​ఇయర్​లో 71శాతం తెచ్చుకోగా, ఈసారి ఐదు శాతం పెంచుకుని 76 శాతానికి చేరింది.

రెండో సంవత్సరంలో కిందటేడు 77 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది కూడా అంతే ఉంది. హైదరాబాద్ జిల్లా ఫస్ట్​ఇయర్​లో 59 శాతం నుంచి 66 శాతానికి పెరిగింది. సెకండ్​ఇయర్​లో గత ఏడాది 65 శాతం సాధించగా, ఈసారి 67.74 శాతంకు పెరిగింది. వికారాబాద్​జిల్లా ఫస్ట్​ఇయర్​లో గతేడాది 53 శాతం సాధించగా, ఈసారి 61 శాతం సాధించింది. సెకండ్​ఇయర్​లో గత ఏడాది 61 శాతం మంది పాస్​అవ్వగా, ఈసారి 68.20 శాతం మంది పాస్​అయ్యారు. 

సర్కారు కాలేజీల స్టూడెంట్ల సత్తా

పద్మారావునగర్/శంషాబాద్: ఇంటర్​ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో మహేంద్ర హిల్స్ గురుకులం స్టూడెంట్లు సత్తా చాటారు. ఫస్ట్​ఇయర్ లో 76 మంది పరీక్షలు రాయగా, 74 మంది పాస్​అయ్యారు. ఎంపీసీ స్టూడెంట్లు కె.శృతి 467, బి.శ్రీచన, డి.పూర్ణిమ 466 మార్కులతో మెరిశారు. బైపీసీ స్టూడెంట్లు ఎం.సంప్రీతి 437 సత్తా చాటింది. సెకండ్​ఇయర్​లో 77 మంది పరీక్షలు రాయగా, 76 మంది పాస్ అయ్యారు.

ఎంపీసీలో డి.మమత 992, టి.మౌనిక 991 మార్కులతో, బైపీసీలో బి.ప్రవళిక 991, జి.స్నేహ 989 మార్కులతో టాపర్లుగా నిలిచారు. పాలమాకుల తెలంగాణ మోడల్ కాలేజీ స్టూడెంట్లు సత్తాచాటారు. సెకండ్​ఇయర్​స్టూడెంట్లు శరణ్య 979, జెన్నిఫర్ 986, శృతి సాహు 941 మార్కులతో, ఫస్ట్​ఇయర్​లో సిరిచందన 455, ఈషా 423, టి.కావ్య 462 మార్కులతో ప్రతిభ కనబరిచారు.

జిల్లాల వారీగా పాస్​పర్సంటేజ్​ 

జిల్లా          ఫస్ట్​ ఇయర్​    సెకండ్​ ఇయర్​


మేడ్చల్           77.21                77.91
రంగారెడ్డి         76.36                 77.63
హైదరాబాద్    66.68                 67.74
వికారాబాద్​      61.31                 68.20