చదువుకోకుండా ఏం పనులు ఇవి.. ఖమ్మం హాస్టల్లో ఏం చేశారో చూడండి..

చదువుకోకుండా ఏం పనులు ఇవి.. ఖమ్మం హాస్టల్లో ఏం చేశారో చూడండి..

ఖమ్మం నగరంలోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహం(ఏ)లో కొంతమంది విద్యార్థుల్లో క్రమశిక్షణ కొరవడింది. ఒకరిపై ఒకరు ముష్టి ఘాతాలు చేసుకునే స్థాయికి దిగజారారు. ఖమ్మం బైపాస్ రోడ్డులో ఉన్న ఈ పోస్ట్ మెట్రిక్ వసతి గృహం(ఏ)లో సుమారు 250 మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు. ఒక విద్యార్థి రాత్రి సమయంలో హాస్టల్కు వస్తే గేటు తీయకపోవడంతో ఘర్షణ మొదలైంది. గేటు దగ్గర కాపలా ఉండాల్సిన వాచ్మెన్ ఏమయ్యాడో తెలియని పరిస్థితి.

దీనిపై పర్యవేక్షణ చేయాల్సిన సంక్షేమ అధికారి తగిన విధంగా వారిని సమన్వయం చేయలేకపోవడం ఘర్షణలకు తావిస్తోంది. ఈ క్రమంలో.. అర్ధరాత్రి వసతి గృహానికి వచ్చిన విద్యార్థిపై కొంతమంది సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. అవమానంగా భావించిన ఆ విద్యార్థి తనకు సంబంధించిన కొంతమంది మనుషులను వసతి గృహానికి తీసుకొచ్చి తనపై దాడి చేసిన విద్యార్థులపై దాడి చేయించినట్లు తెలిసింది.

ALSO READ | టెన్త్​లో 1‌‌‌‌00 శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

విద్యార్థులు గ్యాంగ్ వార్లకు పాల్పడుతుంటే వసతి గృహ సంక్షేమ అధికారి మాత్రం వారిని సమన్వయపరిచి ప్రశాంత వాతావరణం నెలకొల్పడంలో పూర్తిగా విఫలమయ్యాడు. విషయం తెలుసుకున్న ఏఎస్సీడీఓ, డిప్యూటీ డైరెక్టర్ వసతి గృహానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించారు. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. బయట నుంచి మనుషుల్ని తీసుకువచ్చి హాస్టల్ విద్యార్థులపై దాడి చేశాడన్న కారణంతో ఒక విద్యార్థిని హాస్టల్ నుండి తొలగించారు. ఖమ్మం ఏఎస్సీడీవో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.