సూర్యాపేట, వెలుగు : ఈనెల 13న సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభుత్వం నేటి నుంచి 17 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. దీంతో శుక్రవారం గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రైవేట్ స్కూల్స్, హాస్టళ్ల నుంచి పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు వారి తల్లితండ్రులు వచ్చారు.
పండగకు సొంతూరికి వెళ్తున్న స్టూడెంట్స్ తో సూర్యాపేట హైటెక్ బస్టాండ్, కొత్త బస్టాండ్లు రద్దీగా కనిపించాయి. మరోవైపు సంక్రాంతి పురస్కరించుకొని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ అదనంగా 398 బస్సులను ఏర్పాటు చేసింది.