కరీంనగర్‌‌‌‌ జిల్లాలో గ్రాండ్‌‌గా ఆత్మీయ సమ్మేళనాలు

 కరీంనగర్‌‌‌‌ జిల్లాలో గ్రాండ్‌‌గా ఆత్మీయ సమ్మేళనాలు

పెద్దపల్లి,ముత్తారం, వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలో పలుచోట్ల ఆదివారం గ్రాండ్‌‌గా ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌‌‌‌ మండలం మంగపేట స్కూల్‌‌లో 2005లో టెన్త్ చదివిన విద్యార్థులు ఆదివారం ఒక్కచోట చేరారు. పూర్వ విద్యార్థులు కంజుల కిశోర్‌‌‌‌, నాగరాజు, సుమన్‌‌, పవన్‌‌, మమత, శిరీష, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌‌లో 1997--98లో చదువుకున్న పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం జరిగింది. హెచ్‌‌ఎం ఓదెలు, స్కూల్ చైర్మన్ చిగురు స్రవంతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 

ఎమ్మెల్యే బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ ప్రభుత్వ హైస్కూల్‌‌లో 1981-–82లో టెన్త్‌‌ చదివిన పూర్వవిద్యార్థులు ఆదివారం బొంతకుంటపల్లి విజయగార్డెన్స్‌‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాగా పెద్దపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే విజయరమణారావు ఈ బ్యాచ్‌‌కు చెందినవారే. 42 ఏండ్ల తర్వాత ఒక్కచోట చేరి గత స్మృతులను నెమరువేసుకున్నారు. నాటి గురువులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని అనుబంధాల కంటే స్నేహబంధం గొప్పదన్నారు. ఆపదలో ఆదుకునే వారే నిజమైన స్నేహితుడని చెప్పారు. 

22 ఏళ్లకు కలుసుకున్నారు

వేములవాడ, వెలుగు: వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం జడ్పీ హైస్కూల్‌‌లో 2001-–02లో టెన్త్‌‌ చదివిన విద్యార్థులు 22 ఏండ్ల తర్వాత ఒక్కచోట చేరారు. చదువుకున్న టైంలో జరిగిన విషయాలను నెమరువేసుకొని ఉల్లాసంగా గడిపారు. పూర్వ విద్యార్థులు అమరగొండ కిషన్, మెండే పర్శురాం, రామిడి మంగ, చిట్టిరెడ్డి కళ్యాణి, ఆడెపు వాణి,  సుజాత, తిరుపతి,  శ్రీధర్, పద్మ, కవిత, రజిత, సుమలత పాల్గొన్నారు. 

వేములవాడ పట్టణంలోని బాలికల హైస్కూల్‌‌లో 2001–-02 టెన్త్ చదివిన పూర్వవిద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఒక్కచోట చేరి ఉత్సాహంగా గడిపారు. నాటి టీచర్లు, ఎంఈవో కిషన్​సన్మానించారు. 

42 ఏండ్లకు ఉత్సాహంగా.. 

హుజూరాబాద్, వెలుగు: పట్టణంలోని ప్రభుత్వ కాలేజీకి చెందిన 1980–-82లో ఇంటర్‌‌‌‌(బైపీసీ) చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక సిటీ సెంటర్​ ఫంక్షన్​ హాల్​లో నిర్వహించిన కార్యక్రమంలో 42 ఏండ్ల తర్వాత కలుసుకోవడంతో ఉల్లాసంగా గడిపారు. నాడు వారికి చదువు చెప్పిన గురువులను సన్మానించుకున్నారు. 

జమ్మికుంటలో 37 ఏండ్లకు..

జమ్మికుంట, వెలుగు: కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు 37 ఏండ్ల తర్వాత ఒక్కచోట చేరి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జమ్మికుంటలోని హైస్కూల్‌‌ 1987–-88లో టెన్త్ చదివిన పూర్వ విద్యార్థులు స్కూల్‌‌ ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్కూల్‌‌లో 250 మంది విద్యార్థులకు ప్లేట్లు అందజేశారు.