నల్లగొండ గర్ల్స్ జూనియర్ కాలేజీ విద్యార్థినుల ధర్నా 

నల్లగొండ పట్టణంలోని గర్ల్స్ జూనియర్ కాలేజీలో విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. వాష్ రూమ్స్ తో పాటు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై స్టూడెంట్స్  ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ కళాశాల ఆవరణలోనే ఆందోళనకు దిగారు. వెంటనే కాలేజీలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని కోరారు. 

గత కొన్ని రోజులుగా కాలేజీలో మౌలిక వసతులు లేవని ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో తాము ఎలా చదువుకోవాలని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు.