సీఎం రేవంత్​ ఓయూను విజిట్ ​చేయాలి : జార్జిరెడ్డి

సీఎం రేవంత్​ ఓయూను విజిట్ ​చేయాలి : జార్జిరెడ్డి
  • రాష్ట్ర ప్రభుత్వ ఫెలోషిప్ స్కీం ప్రారంభించాలి 
  • టీచింగ్​పోస్టులు భర్తీ చేయాలంటూ పీడీఎస్​యూ భారీ ర్యాలీ 

సికింద్రాబాద్​, వెలుగు : ఓయూ స్టూడెంట్స్ ఎజెండాపై అసెంబ్లీలో చర్చించాలని, సీఎం రేవంత్​రెడ్డి ఓయూను విజిట్​చేయాలని శుక్రవారం పీడీఎస్​యూ(జార్జిరెడ్డి) ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీ తీసి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద బైఠాయించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.నాగేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి ఎన్.సుమంత్, స్టేట్ గర్ల్స్ కన్వీనర్ కె.స్వాతి మాట్లాడుతూ వర్సిటీలో మెరుగైన వసతులు కల్పించడంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఓయూలో మెస్ డిపాజిట్ల రూపంలో ఫీజులు వసూలు చేస్తున్నారని, ఉచిత మెస్ వసతి కల్పించాలని కోరారు. 

ఓయూ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ఫెలోషిప్ పథకం ప్రారంభించాలని, హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ప్రవేశపెట్టాలన్నారు. 13 ఏండ్లుగా టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. పీడీఎస్​యూ(జార్జిరెడ్డి)గ్రేటర్ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి ఎస్.అంజి, ఓయూ లీడర్లు సంతోష్, క్రాంతి, తిరుపతి పాల్గొన్నారు.  న్యూ గోదావరి హాస్టల్ మెస్​లో నాసిరకం భోజనం పెడుతున్నారని, సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్టూడెంట్స్​ ఓయూ రోడ్డుపై బైఠాయించారు. టిఫిన్, కూరలు క్వాలిటీగా ఉండడం లేదని వాపోయారు. చీఫ్​వార్డెన్​విద్యార్థులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.