సుల్తానాబాద్, వెలుగు: జాతీయ పతాక ఆమోదిత దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సోమవారం లయన్స్ క్లబ్, ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.
100 మీటర్ల భారీ త్రివర్ణ పతాకాన్ని పట్టణ వీధుల గుండా ఊరేగించారు. లయన్స్ క్లబ్ జిల్లా మొదటి ఉప గవర్నర్ కోదండరాములు ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని 1947 జులై 22న రాజ్యాంగం ఆమోదం తెలిపిందని అన్నారు.