జగిత్యాలలో చలి తీవ్రతతో స్టూడెంట్స్కు అస్వస్థత

జగిత్యాలలో  చలి తీవ్రతతో స్టూడెంట్స్కు అస్వస్థత

జగిత్యాల, వెలుగు: తీవ్రంగా పెరిగిన చలితో స్టూడెంట్స్ అస్వస్థతకు గురైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. సారంగపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుతున్న ఆరుగురు స్టూడెంట్స్ తీవ్రమైన చలిని తట్టుకోలేక కాళ్లు తిమ్మిర్లు, శ్వాసకోస ఇబ్బందులు పడడంతో పాటు కండ్లు తిరగడంతో బుధవారం అస్వస్థతకు గురయ్యారు. 

వీరిని వెంటనే జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. డీఎంహెచ్ వో శ్రీధర్ వెళ్లి  స్టూడెంట్స్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం వరకు డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచి, ఆరోగ్యం నిలకడగా ఉండటంతో  తిరిగి స్కూల్ కు పంపించారు. స్టూడెంట్స్ ఎలాంటి ఆందోళన చెందొద్దని, చలి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.