- జ్వరం, విరేచనాలతో హాస్పిటల్‌లో చేరిన ఐదుగురు స్టూడెంట్లు
ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన స్టూడెంట్లు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, విరేచనాలతో బాధపడుతూ వాంకిడి పీహెచ్‌సీలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న కొట్నక్ జంగూబాయి, పెందోర్ రాజేశ్వరి సోమవారం హాస్పిటల్‌లో చేరగా, ఐదో తరగతి స్టూడెంట్ సాయి కీర్తన, ఆరో తరగతి స్టూడెంట్ మాడావి అలకనంద, తొమ్మిదో తరగతి స్టూడెంట్ రాజేశ్వరి బుధవారం జ్వరం, విరేచనాలతో బాధపడడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
స్టూడెంట్లు సాధారణ జ్వరం, విరేచనాలతోనే బాధపడుతున్నారని, ముందస్తుగా అబ్జర్వేషన్‌లో పెట్టి ట్రీట్‌మెంట్ చేస్తున్నామని వాంకిడి హాస్పిటల్ డాక్టర్ వినేశ్ చెప్పారు. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న స్టూడెంట్స్‌ను బుధవారం తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతి, నాయకులు కోట్నక రాంశావ్, కనక ప్రకాశ్ పాల్గొన్నారు.