
రామాయంపేట, వెలుగు : బస్సు రాక పోవడంతో స్టూడెంట్స్కిలోమీటర్ల కొద్ది నడిచి స్కూల్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెదక్జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి, పర్వతాపూర్, కాట్రియాల, లక్ష్మా పూర్ గ్రామాలకు ఐదు రోజులుగా ఆర్టీసీ బస్సు రాక పోవడం తో స్టూడెంట్స్తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50 మంది వరకు అటు కాట్రియాల స్కూల్ కు, రామాయంపేట కాలేజ్ కు నిత్యం వెళ్తారు. కిలోమీటర్ల మేర బ్యాగులు మోసుకుంటూ నడుచు కుంటూ వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని స్టూడెంట్స్ కోరుతున్నారు.