
- 18 మందికి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు
- బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు 12 మంది తరలింపు
- ఆరుగురికి పీహెచ్సీలో చికిత్స
బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయం స్టూడెంట్లుఆదివారం అస్వస్థతకు గురయ్యారు. 18 మంది వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విలవిల్లాడగా 12 మందిని బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మిగిలిన ఆరుగురికి కన్నెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిం చారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల కథనం ప్రకారం..కొద్ది రోజులుగా స్టూడెంట్స్దగ్గు, జ్వరం తదితర సమస్యలతో బాధపడుతున్నారు.
కస్తుర్బా సిబ్బందికి చెప్తే అన్నీ నాటకాలంటూ కొట్టిపారేశారు. ఏఎన్ఎం మాత్రం కొన్ని మందులిచ్చారు. శనివారం రాత్రి భోజనం చేసి పడుకున్నారు. ఉదయం లేచిన తర్వాత వాంతులు, విరేచనాలతో పాటు కడుపునొప్పితో బాధపడ్డారు. విషయం తెలుసుకున్న జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, పోలీసులతో కలిసి అక్కడికి వచ్చారు.108 అంబులెన్స్‌లో 12 మందిని బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. స్టూడెంట్ల హెల్త్ కండీషన్ బాగానే ఉందని భీమిని పీహెచ్సీ డాక్టర్ కృష్ణ తెలిపారు.