కామారెడ్డి టౌన్, వెలుగు : లింగంపేట మండలం భవానిపేట దళితవాడ ప్రైమరీ స్కూల్‌కు అదనంగా టీచర్ని కేటాయించాలని డిమాండ్‌చేస్తూ స్టూడెంట్స్, స్థానికులు కామారెడ్డి కలెక్టరేట్ఎదుట సోమవారం ధర్నా చేశారు. 75 మంది స్టూడెంట్స్ఉంటే ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారని, దీంతో స్టూడెంట్స్ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఎస్ఎమ్సీ చైర్మన్ పోచయ్యతో పాటు, స్టూడెంట్స్, స్థానికులు డీఈవో రాజును కలిసి సమస్యను వివరించారు. మరో స్కూల్ నుంచి ఒక టీచర్ని డిప్యూటేషన్‌పై పంపిస్తున్నట్లు డీఈవో తెలిపారు.