కొత్తపల్లి, వెలుగు: కరాటే చాంపియన్షిప్లో కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థులు మెడల్స్‌సాధించినట్లు చైర్మన్ వి.నరేందర్రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జీఆర్ఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 4న నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో కటా విభాగంలో జయరామ్ గోల్డ్‌మెడల్, ఎన్‌పీ కృష్ణచైతన్య సిల్వర్ మెడల్స్ గెలిచారన్నారు.
బుధవారం విజేత విద్యార్థులను చైర్మన్‌అభినందించారు.