ఇండియా ఇంటర్నేషనల్​ సైన్స్​ ఫెస్టివల్​కు జిల్లా స్టూడెంట్స్​ఎంపిక

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  హర్యానా రాష్ట్రంలోని ఫరిదాబాద్​లో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్న ఇండియా ఇంటర్నేషనల్​ సైన్స్​ ఫెస్టివల్​కు జిల్లా నుంచి ఏడుగురు స్టూడెంట్స్​ ఎంపికయ్యారని డీఈఓ వెంకటేశ్వరాచారి, జిల్లా సైన్స్​ ఆఫీసర్​ చలపతిరాజు తెలిపారు. సైన్స్​ ఫెస్టివల్​కు సెలెక్షన్​ అయిన స్టూడెంట్స్​తోపాటు ఎస్కార్ట్​ టీచర్స్​తో డీఈఓ ఆఫీస్​లో శుక్రవారం నిర్వహించిన ప్రోగ్రాంలో వారు మాట్లాడారు. సైన్స్​ అండ్​ టెక్నాలజీ పబ్లిక్​ అవుట్​ రిచ్​ ఇన్​ అమృత్​ కల్​అనే అంశంపై ఈ ఫెస్టివల్​జరుగనుందని తెలిపారు.

స్టూడెంట్స్​ సైన్స్​ విలేజ్​లో భాగంగా జిల్లా నుంచి ఏడుగురు స్టూడెంట్స్​ఎంపికయ్యారన్నారు. ఇల్లెందు మండలం రొంపేడ్​ ఆశ్రమ పాఠశాలకు చెందిన కె. అశ్విని, మణుగూరులోని ఎక్స్​లెంట్​హైస్కూల్​కు చెందిన ఎండీ.రియాన్​ నసీఫ్, పోకలగూడెం జిల్లా పరిషత్​ హైస్కూల్​కు చెందిన భానోత్​ ధనూష్​, కొత్తగూడెంలోని త్రివేణి స్కూల్​కు చెందిన కట్టం అలేఖ్య

దమ్మపేట జిల్లా పరిషత్​ హైస్కూల్​కు చెందిన బి. చరణ్​, భద్రాచలంలోని సెయింట్​ పాల్స్​ హైస్కూల్​కు చెందిన ఎన్. కిషన్​ ఆదర్శ్, ఇల్లెందులోని బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన బాదావత్​ కార్తీక సైన్స్​ ఫెస్టివల్​కు సెలెక్ట్​ అయినట్లు తెలిపారు.