అమెరికన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో..హార్వెస్ట్ ఆల్​ఇండియా ఫస్ట్

అమెరికన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో..హార్వెస్ట్ ఆల్​ఇండియా ఫస్ట్

ఖమ్మం టౌన్, వెలుగు: అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో మ్యాథ్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన ‘పర్పుల్ కమిట్ మ్యాథ్స్ మిట్ ఒలింపియాడ్’ పరీక్షలో ఖమ్మంలోని హార్వెస్ట్ స్కూల్ స్టూడెంట్లు సత్తా చాటారు. ఈ ఏడాది ఏప్రిల్ లో పరీక్ష జరగగా, సోమవారం రిజల్ట్​వచ్చింది. 

ALSOREAD:బొగ్గు గనుల పరిసరాల్లో లిక్కర్​ పార్టీలు బంద్..సర్క్యూలర్​ జారీ చేసిన సింగరేణి యాజమాన్యం

వేల మంది పాల్గొన్న పరీక్షలో తమ స్టూడెంట్లు ఆల్​ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్​కరస్పాండెంట్ పి.రవి మారుత్ తెలిపారు. ప్రిన్సిపల్ ఆర్.పార్వతిరెడ్డి, ఐఐటీ బ్రాంచ్ ఇన్​చార్జ్ జి.ఉమామహేశ్వరరావుతో కలిసి స్టూడెంట్లను అభినందింaచారు. సర్టిఫికెట్లు, మెమోంటోలు అందజేశారు.