పెద్దమందడి, వెలుగు : మానవ మనుగడ మట్టితోనే ముడిపడి ఉందని హార్టికల్చర్ కాలేజ్ డీన్ డాక్టర్. సైదయ్య పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ నేల దినోత్సవ సందర్భంగా కాలేజీ స్టూడెంట్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాసాలు, పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహించారు. ఆరోగ్యకరమైన నేల భవిష్యత్తు తరాలకు జీవనాధారమన్నారు. నేల సంరక్షణ ప్రజలందరి బాధ్యతగా గుర్తించాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు టి బేబీరాణి, డాక్టర్లు జి.విద్య, పూర్ణిమ మిశ్రా, శ్రీనివాస్, చంద్రశేఖర్, గౌతమి, భాగ్యశాలి పాల్గొన్నారు.
కోస్గి : నేలను సంరక్షించుకునేందుకు రైతులు సహజ సిద్ధమైన జీవన, సేంద్రియ ఎరువులనే వాడాలని ఏవో రామకృష్ణ కోరారు. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా కోస్గి, గుండుమాల్ మండలాల్లోని రైతు వేదికల్లో సమావేశం ఏర్పాటు చేశారు. నేల సంరక్షణ, ఎరువు తయారీ, వాడకంపై అవగాహన కల్పించారు. ఏఈవోలు నరేందర్, చందన, నవ్య పాల్గొన్నారు.
లింగాల : రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని ఏవో నాగార్జున రెడ్డి సూచించారు. నేల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. భూసార పరీక్షలతో కలిగే లాభాలను రైతులకు వివరించారు. ఏఈవో సురేందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.