టాలెంట్‌‌ సెర్చ్‌‌లో జయ సత్తా

సూర్యాపేట, వెలుగు : డాక్టర్ ఏఎన్ రావు అవార్డు కౌన్సిల్ వారు నిర్వహించిన 33వ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్‌‌లో సూర్యాపేటకు చెందిన జయ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. తెలంగాణ, ఏపీలోని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా 32 ర్యాంకులు సాధించారు.  వీరిలో 9వ తరగతి నుంచి 11 మంది, టెన్త్‌‌ నుంచి 21 మంది ఉన్నారు. శుక్రవారం పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్,  డైరెక్టర్లు జల్లా పద్మ , బింగి జ్యోతి స్టూడెంట్లతో పాటు టీచర్లను అభినందించారు.