భిక్కనూరు, వెలుగు: హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని స్టూడెంట్లు రాస్తారోకో చేశారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బీబీపేట జ్యోతిబాపూలే హాస్టల్విద్యార్థులు హైవేపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్బిల్డింగ్లో కొనసాగుతున్న తమ హాస్టల్లో మౌలిక వసతులు లేక ఇబ్బందుల ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో స్టూడెంట్లు రాస్తారోకో విరమించారు.