కామారెడ్డి టౌన్, వెలుగు: తెలంగాణ యోగా, స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 5 వరకు పటాన్ చెరులో జరిగిన రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో కామారెడ్డి జిల్లా స్టూడెంట్స్ ప్రతిభ చాటారు. సీనియర్ బాలుర విభాగంలో జడ్పీ హైస్కూల్ రెడ్డిపేట తండాకు చెందిన జి.సందీప్, జి.నవదీప్ గోల్డ్ మెడల్ సాధించారు.
సబ్ జూనియర్ బాలికల విభాగంలో నికిత (మాచారెడ్డ్) గోల్డ్ మెడల్ అందుకున్నారు. సహస్ర రెండో స్థానంలో నిలిచారు. వీరంతా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని యోగా అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం రామిరెడ్డి అభినందించారు.