కొత్తపల్లి అల్ఫోర్స్​ స్టూడెంట్స్‌‌కు గోల్డ్‌‌మెడల్స్‌‌

కొత్తపల్లి, వెలుగు: ఎస్​వోఎస్​ అంతర్జాతీయ మ్యాథ్స్​ ఒలింపియాడ్​లో కొత్తపల్లి అల్ఫోర్స్​ ఇ టెక్నో స్కూల్​ స్టూడెంట్స్​ గోల్డ్​మెడల్స్​ సాధించినట్లు చైర్మన్​ వి.నరేందర్​రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో ప్రపంచంతో పోటీపడాలంటే మ్యాథ్స్​పై అవగాహన పెంచుకోవాలన్నారు.

మ్యాథ్స్​ ఒలింపియాడ్​లో కె.హావిశ్‌‌తేజ, ఎ.విహాన్​కృష్ణ, మెహర్, జి.జోయల్ డేవిస్, డి.చంద్రహాస్, కె.రిత్విక్​రెడ్డి, జి.ప్రహాస్ మోహన్, శివస్మరణ్‌‌, బి.సాయిహర్షిత్  గోల్డ్​మెడల్స్​ సాధించినట్లు  ఆయన పేర్కొన్నారు. అనంతరం గోల్డ్​మెడల్స్​ సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.