- శ్రీ చైతన్య స్కూల్ హ్యాట్రిక్ ప్రపంచ రికార్డ్
హైదరాబాద్, వెలుగు: స్టూడెంట్లే, టీచర్లు ఒక్కటై ఎంతో ఇష్టంతో కృషి చేయడం వల్లే వరల్డ్ రికార్డ్ సాధ్యమైందని శ్రీ చైతన్య స్కూల్స్ అకడమిక్ డైరెక్టర్ సీమ అన్నారు. శ్రీ చైతన్య స్కూళ్లకు చెందిన 2 వేల మందికి పైగా ప్రైమరీ, ప్రీ ప్రైమరీ స్టూడెంట్లు ఒకటి నుంచి వంద వరకు మ్యాథ్స్ టేబుల్స్‌ను వంద నిమిషాల్లో అప్పజెప్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అకడమిక్ డైరెక్టర్ సీమ వివరించారు. శ్రీ చైతన్య స్కూల్స్ అంటేనే గ్రేట్ ఫ్యూచర్‌కి స్ట్రాంగ్ ఫౌండేషన్ అని ఆమె అన్నారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్థాయిల్లోనే చిన్నారుల్లో దాగున్న నైపుణ్యాలను వెలికితీయడం, ఒత్తిడి లేకుండా మంచి మార్గంలో వారిని ట్రైన్ చేయడం తమ లక్ష్యమన్నారు.
వంద రోజుల శిక్షణతో 10 రాష్ట్రాలలోని 73 బ్రాంచీల నుంచి 400ల జూమ్ లింక్స్ ద్వారా పాల్గొని 2 వేల మంది స్టూడెంట్లు వంద మ్యాథ్స్ టేబుల్స్ ను 100 నిమిషాల్లో అప్పజెప్పారని ఆమె తెలిపారు. సైంటిఫిక్ మెథడ్స్, రీసెర్చ్ బేస్డ్ కరిక్యులమ్, వెల్ ప్లాన్డ్ టీచింగ్ సిస్టమ్‌తో తమ స్టూడెంట్లను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో టాపర్లుగా మారుస్తున్నామని అన్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు పాల్గొనే నాసా– ఎన్‌ఎస్ఎస్ స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్‌లోనూ వరుసగా తొమ్మిదో సంవత్సరం శ్రీ చైతన్య స్కూల్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిందని ఆమె చెప్పారు. వరల్డ్ రికార్డ్ సృష్టించిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డా. బీఎస్ రావు అభినందనలు తెలిపారు.