
కొమరం భీం జిల్లా : అసిఫాబాద్ అంబేద్కర్ చౌక్లో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినుల రాస్తారోకో నిర్వహించారు. హాస్టల్లో తమకు కనీసం వసతులు కూడా కల్పించడం లేదని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఫుడ్ విషయంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
హాస్టల్ సిబ్బంది తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినీలు ఆరోపణలు చేశారు. హాస్టల్ ప్రిన్సిపాల్ జ్యోతి లక్ష్మీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి సమయాల్లో వాచ్ మెన్ గా ఉండే వాళ్లు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తినే ఫుడ్ లో పురుగులు వస్తున్నాయని, ఎలా తినాలని ప్రశ్నించారు. గత మూడు నెలల నుంచి తమ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వాపోయారు.
ALSO READ :బీఆర్ఎస్ దళితులను మోసం చేసింది : అధ్యక్షుడు మహేశ్
తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ తమ వద్దకు వచ్చి సమాధానం చెప్పి.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.