ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ర్యాలీలో వివిధ కాలేజీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శనివారం ఉదయం లుంబిని పార్క్ నుంచి రెడ్ హిల్స్‌లోని ఎంఎన్‌జే హాస్పిటల్ వరకు చేపట్టిన ఈ ర్యాలీని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు.
కేబీఆర్ పార్క్‌లో పింక్ డిపెండర్ వాకతాన్ ఆధ్వర్యంలోని ర్యాలీకి నగర సీపీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. వెలుగు, మెహిదీపట్నం