భద్రాచలం, వెలుగు : పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని పట్టణంలో బుధవారం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ ఆఫీస్‌ను ముట్టడించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు రూ.4వేల కోట్లు తక్షణమే రిలీజ్ చేయాలన్నారు.
ALSO READ: ఎల్ఎండీ నుంచి 6 గేట్ల ద్వారా నీటి విడుదల
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేసి ఆర్డీవో ఆఫీసు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఆర్డీవో మంగీలాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ,జిల్లా అధ్యక్షురాలు కె.సంధ్య,డివిజన్ కార్యదర్శి మునిగల శివప్రశాంత్, పాయం నవీన్ తదితరులుపాల్గొన్నారు.