ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

స్కాలర్‌‌షిప్‌‌, రీయింబర్స్‌‌మెంట్‌‌ బకాయిలు రిలీజ్‌‌ చేయాలని డిమాండ్‌‌

సూర్యాపేట, వెలుగు : స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేయాలని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సూర్యాపేట కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఎస్ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ నాయకులు, స్టూడెంట్లు ర్యాలీగా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్మ మాట్లాడుతూ స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 3 వేల కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందన్నారు. దీని వల్ల స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్మించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛార్జీలు పెంచాలని, స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటును తగ్గించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని కోరారు. అక్రమ అరెస్టులు, కేసులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. సుమారు గంటన్నర పాటు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట బైఠాయించినా ఆఫీసర్లు ఎవరూ రాకపోవడంతో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ నాయకులను అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే ప్రయత్నం చేయగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరకు ధనియాకుల శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి చివ్వెంల స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అయితే లీడర్లను అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే క్రమంలో ఓ విద్యార్థి సంఘ నాయకుడిపై పోలీసులు దాడి చేశారు. విషయం బయటకు పొక్కకుండా సదరు విద్యార్థి సంఘం నాయకుడే పోలీసులపై దాడి చేశాడంటూ కేసు నమోదు చేశారు. ఈ విషయంపై చివ్వెంల ఎస్సై విష్ణు మాట్లాడుతూ కలెక్టరేట్ వద్ద పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా ధర్నా చేయడంతో పాటు, స్టూడెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి చేయడం వల్లే స్డూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ జిల్లా నాయకులు జంగంపల్లి సాయి, వేల్పుల ఉత్తేజ్, బానోతు వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కొండ అజయ్, ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జశ్వంత్, అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేణు, శ్రావణి, యామిని పాల్గొన్నారు.

కలిసికట్టుగా పనిచేయండి

యాదాద్రి, వెలుగు : బీజేపీ ప్రత్యామ్నాయశక్తిగా ఎదుగుతోంది.. సరైన టైం వచ్చింది.. కలిసికట్టుగా పనిచేయండి, తప్పకుండా అధికారంలోకి  వస్తాం’ అని బీజేపీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి తరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్తున్న ఆయన యాదాద్రి జిల్లా భువనగిరిలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు, పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలాబలాలు, నాయకుల పనితీరు, సామాజిక వర్గాల వారీగా ఓట్ల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టపడిన వారికి పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కాగా భువనగిరి అసెంబ్లీ టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బీసీలకు కేటాయించాలని పలువురు లీడర్లు తరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరారు.  బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ బంగారు శృతి, నాయకులు మాయ దశరథ, జనగాం కవిత, నర్సింహాచారి, రత్నపురం బలరాం, ఉపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుర్వి లావణ్య, నీలం రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

మునుగోడులో బీజేపీ సత్తా చాటాలి

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో శనివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 60 శాతం ఓట్లను సాధించినట్లయితే బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందన్నారు. ప్రతి కార్యకర్త తనే అభ్యర్థిగా భావించి ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పట్టణ సమన్వయకర్త మోగదాల రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భిక్షమాచారి ఉడుగు వెంకటేశం, పోలోజు శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, గుజ్జుల సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బొంగు రాజుగౌడ్, వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

పెరుగుతున్న కరోనా కేసులు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి కాస్త తగ్గుముఖం పట్టిన కేసుల నమోదు జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మళ్లీ పెరగడం స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. జులై, ఆగస్టు నెలల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి.  యాదాద్రి జిల్లాలో జులైలో 320 పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు నమోదు కాగా, ఆగస్టులో 333 నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో జూలైలో 125 కేసులు నమోదైతే ఆగస్టులో 187 మందికి పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తేలింది. పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలన్న విషయమే మర్చిపోయారు. పైగా కేసులు బయటపడకుండా చర్యలు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 

వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏల సమస్యను గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్తా

యాదగిరిగుట్ట, వెలుగు : హామీలు నెరవేర్చాలంటూ వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏలు 41 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏల సమస్యలను గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నా చేస్తున్న వీఆర్ఏలకు శనివారం ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్రాన్ని గాలికొదిలేసిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాన్ని ఉద్ధరిస్తానంటూ పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనతో తెలంగాణను అప్పులపాలు చేసిన వ్యక్తే దేశానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎన్ని జిమ్మిక్కులు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటమి తప్పదన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణగౌడ్, మాజీ ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాయకులు రాజయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మండల ప్రధాన కార్యదర్శి మేకల శ్రీను, ఏడుముళ్ల ఆంజనేయులు, బొల్లు నర్సింహ పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందాలి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందేలా చర్యలు తీసుకోవాలని నల్గొండ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టి.వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఓటరు నమోదు, ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శనివారం అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో పాటు వివిధ శాఖల ఆఫీసర్లతో గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 జనవరి ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు జన్మించిన వారిని ఓటరుగా నమోదు చేయాలన్నారు. గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మ, భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, డీఈవో భిక్షపతి, డీపీవో విష్ణువర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పరిశ్రమల కేంద్రం జీఎం కోటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు పాల్గొన్నారు.

డ్రైవర్లు రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించాలి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : డ్రైవర్లు రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిస్తూ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడపాలని జిల్లా జడ్జి బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జగ్జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. రోడ్డు భద్రత, ప్రజా సంక్షేమంపై రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండొదన్నారు.  బి.దీప్తి, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీఎస్పీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.

ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చట్టాలపై అవగాహన ఉండాలి

యాదాద్రి, వెలుగు : వాహనాలు నడిపేవారు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పనిసరిగా పాటించాలని యాదాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చట్టాలు, రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.మారుతీదేవి, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి దశరామయ్య, ప్రధాన జూనియర్ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి డి. నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, అదనపు జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి కవిత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయకుమారి పాల్గొన్నారు.

వాహనాలు జాగ్రత్తగా నడపాలి

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : వాహనాలను నిర్లక్ష్యంగా నడిపి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి శ్యాంకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. స్థానిక కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన  న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉల్లంఘించడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్ల శిక్షలను కఠినతరం చేసినట్లు చెప్పారు. అనంతరం కోర్టు నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, సీఐ రామలింగారెడ్డి, ఏజీపీ ఉప్పల గోపాలకృష్ణమూర్తి, బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యదర్శి జక్కుల నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మునుగోడులో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయం ఖాయం

మునుగోడు, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయం ఖాయమని మాజీమంత్రి, ఉప ఎన్నికల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి రాంరెడ్డి దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ధీమావ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడులో శనివారం డీసీసీ అధ్యక్షుడు శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలకు భరోసా కల్పించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు చెప్పారు. పార్టీని, కార్యకర్తలను మోసం చేసిన రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని ఓడించాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేశానన్న ఆయన బీజేపీలో ఎందుకు చేరాడని ప్రశ్నించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని, ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. డబ్బులతో ఓట్లు కొనుక్కోవచ్చని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూస్తున్నారని, కానీ ఇక్కడి ప్రజలు చైతన్యవంతులని సీఎం మాటలు ఎవరూ నమ్మరన్నారు. రైతు డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీపై విడుదల చేసిన చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రతి గడపకు తీసుకుపోవాలని సూచించారు. అనంతరం చెరుకు సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీని గద్దె దించడమే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యమన్నారు. అనంతరం బీజేపీ, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చార్జిషీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత, నాయకులు బోసు రాజు, మల్లు రవి, బలరాంనాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ ఎమ్మెల్యే విజయరామారావు, బాలునాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి, పల్లె కల్యాణి పాల్గొన్నారు.

బీఎస్పీతోనే బహుజనులకు న్యాయం

మునుగోడు, వెలుగు : తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగాలంటే బీఎస్పీతోనే సాధ్యమని ఆ పార్టీ నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడులో  శనివారం నిర్వహించిన సమావేశానికి ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు పోరాటాలు నిర్వహిస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఎస్పీ తరఫున క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోటీలో దింపుతామని ప్రకటించారు. మునుగోడులో బీజేపీ, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో నల్గొండ జిల్లా అధ్యక్షుడు పూదర సైదులు, నియోజకవర్గ అధ్యక్షుడు పల్లె లింగస్వామి, నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ఏర్పుల అర్జున్, మాల్గ యాదయ్య, మండల అధ్యక్షుడు పందుల హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రైమరీ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే గుర్తించాలి

సూర్యాపేట, వెలుగు : క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్ల అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలని, వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాలని విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్ర గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. సూర్యాపేట లయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చేతన ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉప్పల నాగలింగయ్య మమోరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్లతో శనివారం సూర్యాపేటలో నిర్వహించిన క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ధారణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉప్పల లలితాదేవి ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిమ్మల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు, లయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు డాక్టర్ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్ర పాల్గొన్నారు.

సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్కుల పంపిణీ

దేవరకొండ, వెలుగు : పేదలకు సీఎం రిలీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన 108 మందికి శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు నల్లగాసు జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వంగాల ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, దొంతం చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎలుగూరి వల్లపురెడ్డి, రమావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ, బోయపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

పెన్షన్‌దారులు ఉద్యోగులతో సమానం

నేరేడుచర్ల, వెలుగు : తెలంగాణలో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల పరిధిలోని పలువురికి శనివారం ఆసరా పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ ధ్యేయమన్నారు. పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దారులంతా ఉద్యోగులతో సమానం అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాలకవీడు మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

అర్హతగల వారికి పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులివ్వాలి

సూర్యాపేట, వెలుగు : అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇవ్వాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సూర్యాపేటలో శనివారం మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ఫలాలు అందకముందే మోటార్లు మునిగిపోయాయన్నారు. నిరంతరం కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నామని టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు గొప్పలు చెప్పుకుంటున్నారే గానీ నిజానికి 8 నుంచి 9 గంటలే వస్తుందన్నారు. రూ. లక్ష లోపు లోన్లను మాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. నాయకులు గట్టు శ్రీనివాస్, గోదాల రంగారెడ్డి, ధరావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకన్న, నామ ప్రవీణ్, వల్దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్వామినాయుడు, యాట వెంకన్న, ధర్మానాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

నల్గొండ, వెలుగు : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం మాధవ ఎడవెల్లిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కర్రె శంకర్ (53) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శనివారం తెల్లవారుజామున పశువుల కొట్టం వద్దకు వచ్చి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కొట్టం వద్దకు వెళ్లి చూసేసరికి చనిపోయి కనిపించాడు. 

ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పల్టీ, రైతు మృతి

గరిడేపల్లి, వెలుగు : ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పల్టీ కొట్టి ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కోదండరాంపురానికి చెందిన మచ్చ నాగేశ్‌‌‌‌‌‌‌‌ (45) అప్పన్నపేట శివారులో ఉన్న నేరేడుచర్లకు చెందిన జానయ్య అనే వ్యక్తి పొలాన్ని కౌలుకు చేస్తున్నాడు. పొలాన్ని నాటు వేసేందుకు శనివారం సాయంత్రం ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌తో దమ్ము చేస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ బురదలో దిగబడింది. దీంతో ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ వెనుక ఉన్న కల్టివేటర్‌‌‌‌‌‌‌‌ను వేరు చేసి ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను కదిలించడంతో ముందు చక్రాలు ఒక్కసారిగా పైకి లేచాయి. దీంతో నాగేశ్‌‌‌‌‌‌‌‌ ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ స్టీరింగ్‌‌‌‌‌‌‌‌, కల్టివేటర్‌‌‌‌‌‌‌‌ మధ్య ఇరుక్కొని స్పాట్‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయాడు.