మరిపెడ ట్రైబల్ డిగ్రీ కాలేజీలో సౌలతుల్లేవ్ .. సార్లు పట్టించుకుంటలేరు

మరిపెడ ట్రైబల్ డిగ్రీ కాలేజీలో సౌలతుల్లేవ్ .. సార్లు పట్టించుకుంటలేరు
  • మరిపెడ ట్రైబల్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్ల ఆందోళన 

నర్సింహులపేట(మరిపెడ),వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ ట్రైబల్ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్లు ఆందోళన చేపట్టారు. కాలేజీలో సరైన సౌలతులు లేవని, లెక్చరర్లు పట్టించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటెండెన్స్ వేసుకుని వెళ్తున్నారే తప్పితే.. విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలపై దృష్టి పెట్టడడం లేదని వాపోతున్నారు.

  బాత్రూమ్ లో వాటర్ రావడం లేదని, డోర్లు సరిగా లేవని, అన్నం మంచిగా లేక పస్తులు ఉంటున్నామని, వాటర్ మోటార్ వేసే సిబ్బంది కూడా  లేక అన్ని తామే చేసుకుంటున్నామని చెబుతున్నారు. పీడీ లేకపోవడంతో  స్పోర్ట్స్ కూడా ఆడడంలేదన్నారు. కాలేజీలో సదుపాయాలు కల్పించకుండా ఇలానే కొనసాగిస్తే చదువుకునేందుకు విద్యార్థులు రారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ గోడును పట్టించుకోవాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.