
- రెండు గ్రామాల్లోనీ ప్రభుత్వ పాఠశాలల ముందు విద్యార్థుల ఆందోళనలు..
- డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయులు తిరిగి రావాలని డిమాండ్
- ప్లకార్డులు చేతబట్టి నిరసనకు దిగిన విద్యార్థులు.. మద్దతు తెలిపిన గ్రామస్థులు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని చౌదర్ గూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు టీచర్లు డిప్యూటేషన్ పై హైదరాబాద్ వెళ్లారు. దానివల్ల తమ చదువుకు ఆటంకం కలుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లు తిరిగి తమ పాఠశాలకు రావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ముందు విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి ఆందోళనకు దిగారు. తమ పాఠశాలలో 200 మంది విద్యార్థులు చదువును అభ్యసిస్తున్నామని, తమకు సరిపోను టీచర్లు లేక తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు. ఈ మేరకు తమ పాఠశాల నుండి డిప్యూటేషన్ పై వెళ్లిన టీచర్లు తిరిగి రావాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆందోళన చేపట్టిన విద్యార్థులకు గ్రామస్థులు మద్దతు తెలిపారు..