కర్రీ పఫ్లో రబ్బర్లు.. మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

కర్రీ పఫ్లో రబ్బర్లు.. మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి యూనివర్సిటీలో మరోసారి విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలో ఆహారంలో పురుగులు వచ్చాయటూ విద్యార్థుల ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. 2024,  జూన్ 6వ తేదీ రాత్రి భోజనంలో పురుగులు, ప్లాస్టిక్ వస్తువులు వచ్చాయంటూ యూనివర్సిటీ ముందు విద్యార్థులు బైఠాయించి ధర్నా చేశారు. 

మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ విద్యార్థులకు మద్దుతగా ఎన్ఎస్ యూఐ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల్లో ఫీజులు తీసుకుని పురుగులు ఉన్న ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. గతంలోనూ అనేకసార్లు భోజనం విషయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాణ్యమైన ఆహారం పెట్టడడంలేదని.. అన్నంలో పురుగులు వస్తున్నాయని వర్సిటీ హాస్టల్ లో విద్యార్థులు నిరసనకు దిగారు. పలుసార్లు మల్లారెడ్డి.. యూనివర్సిటీకి వెళ్లి నాణ్యమైన భోజనం అందిస్తామని విద్యార్థులకు మాటిచ్చారు.