హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లి ప్రైమరీ స్కూల్లో టాయిలెట్స్కట్టించమని పాఠశాల ఎదుట స్టూడెంట్స్బుధవారం నిరసన వ్యక్తం చేశారు. బడిలో కనీస వసతులు లేవని, శిథిలమైన తరగతి గదుల్లో పాములు, తేళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో బడికి రావాలంటేనే భయంగా ఉందని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
– శాయంపేట, వెలుగు