సూర్యాపేట : సూర్యాపేట జిల్లా బాలెంల వెల్ఫేర్ హాస్టల్ ఎదుట శనివారం విద్యార్థినీలు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ శైలజను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ రూంలో బీరు బాటిల్స్ ఉన్నాయన్నారు విద్యార్థినిలు. మద్యం తాగుతూ తమను వేధిస్తున్నాడని స్టూడెంట్స్ ఆరోపించారు. గురుకులాల సెక్రటరీ వచ్చేంత వరకు ధర్నా కొనసాగిస్తామన్నారు. కాలేజీ దగ్గరకు ఆర్డీవో,ఆర్సీవో చేరుకొని విద్యార్థినులతో మాట్లాడుతున్నారు.