బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని దీపిక మృతిపట్ల విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని దీపిక మృతిపట్ల విద్యార్థుల ఆందోళన

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని దీపిక మృతిపట్ల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ట్రిపుల్ ఐటీ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన తెలిపారు. తమ సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు బైఠాయించి.. నిరసన తెలిపారు. మరోవైపు.. ఆందోళనకు దిగిన విద్యార్థులను హాస్టల్ లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది. 

పీయూసీ- ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని దీపిక మంగళవారం (జూన్ 13న) చున్నీతో ఉరేసుకుని.. అపస్మారక స్థితిలో తోటి విద్యార్థులకు కనిపించింది. వెంటనే ఆమెను క్యాంపస్ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లి.. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దీపిక కన్నుమూసింది.పరీక్ష రాసిన కొద్దిసేపటికే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. దీపిక ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. 

మరోవైపు.. దీపికి మృతిపట్ల ట్రిపుల్ ఐటీ వీసీ వెంకటరమణ సంతాపం వ్యక్తం చేశారు. దీపిక కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.