జీడిమెట్ల, వెలుగు: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సీటీ యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల కింద అగ్రికల్చర్బీఎస్సీ ఫస్ట్ఇయర్స్డూడెంట్ అరుణ్‌కుమార్ ఎగ్జామ్హాల్లో చనిపోవడానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ శనివారం ఆందోళనకు దిగారు.
యాజమాన్యం యూనివర్సిటీలో అంబులెన్స్సౌకర్యం కల్పించకపోవడంతో అరుణ్చనిపోయాడని ఆరోపించారు. అంబులెన్స్ఉంటే బతికేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.