ఇంటర్లో పాసై, ఎంసెట్లో క్వాలిఫై అయిన సుమారు 2000 మందికి టీఎస్ఎంసెట్–2020లో ర్యాంకులు దక్కలేదు. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ సంఖ్య సరైన విధంగా ఇవ్వకపోవడంతో సుమారు రెండు వేలకు మందికి పైగా ఎంసెట్ ఫలితాల్లో తేడా వచ్చిందని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. వారందరి మొబైల్ ఫోన్లకు ప్రత్యేక లింక్ పంపించామని.. ఆ లింక్ ద్వారా హాల్ టికెట్ సంఖ్య పంపిస్తే.. ఇంటర్ మార్కులు తీసుకొని ర్యాంకులు కేటాయిస్తామన్నారు. ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజి ఇచ్చి ఎంసెట్ ర్యాంకులు ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ప్రతీ ఏడాది ఈ సమస్య తలెత్తుతోందని.. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగదని ఆయన చెప్పారు. విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రిజర్వ్ చేసిన ప్లేస్ల్లో వారికి ర్యాంకులు కేటాయిస్తామని చెప్పారు. క్వాలిఫై మార్కులు వచ్చినా ర్యాంకులు అలాట్ కాని స్టూడెంట్స్ convenertseamcet2020a@jntuh.ac.in లేదా convenertseamcet2020b@jntuh.ac.in లకు హాల్ టికెట్ వివరాలు పంపించాలని సూచించారు.
For More News..