కలెక్టర్​కు రాఖీ కట్టిన అల్ఫోర్స్ స్టూడెంట్స్

కొత్తపల్లి, వెలుగు :  పట్టణంలోని అల్ఫోర్స్ ఇ -టెక్నో స్కూల్ విద్యార్థులు కలెక్టర్ గోపికి బుధవారం రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపినట్లు స్కూల్ చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను పాటించడం ద్వారా విలువలను పరిరక్షించవచ్చన్నారు. 

హిందూ సంప్రదాయాలలో రాఖీ పండుగకు విశిష్టత ఉందని, సమాజంలో సోదరభావం పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో టీచర్స్ పాల్గొన్నారు.