- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ముషీరాబాద్, వెలుగు: చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని విద్యార్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంబర్‌పేట్ మండల్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు జే. రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన 2024 ఎస్ఎస్‌సీ టాపర్స్ అవార్డు ఫంక్షన్ జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే విషయంలో టీచర్ల పాత్ర కీలకమన్నారు. బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్, శ్రీకాంత్ రెడ్డి, రవి కుమార్, ఎం రవి, జి. శోభా రెడ్డి పాల్గొన్నారు.