కాకా చిన్నప్పటి నుండే స్పోర్ట్స్‎లో ట్రైనింగ్ ఇచ్చారు: MP గడ్డం వంశీ

కాకా చిన్నప్పటి నుండే స్పోర్ట్స్‎లో ట్రైనింగ్ ఇచ్చారు: MP గడ్డం వంశీ

మంచిర్యాల: విద్యార్థులు చదువుతో పాటు ఆటలపై కూడా దృష్టి పెట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. శరీరానికి శారీరక శ్రమ కూడా అవసరమని చెప్పారు. 2024, నవంబర్ 14న లక్షెట్టిపేట గర్ల్స్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10th జోనల్ లెవెల్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ గడ్డం వంశీ చీఫ్ గెస్ట్‎గా హాజరయ్యారు. గేమ్స్ స్పోర్ట్స్ మీట్‎లో గెలుపొందిన విజేతలకు ఎంపీ వంశీ బహుమతులు ప్రధానం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్ ఆడటం వల్ల విద్యార్థుల్లో సమయస్ఫూర్తి, పట్టుదల పెరుగుతుందని అన్నారు. నేను స్కూల్, కాలేజీల్లో చదువుకున్నప్పుడు స్పోర్ట్స్ ఆడేవాడిని.. తన తాత కాకా వెంకటస్వామి నాకు చిన్నతనం నుంచే స్పోర్ట్స్‎లో ఎన్నో మెలుకువలు నేర్పించారని గుర్తు చేసుకున్నారు. 15 పాఠశాలలోని 1275 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్‏తో పాటుగా ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నందుకు ఎంపీ వంశీకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.