విద్యార్థి దశలోనే చట్టాల గురించి తెలుసుకోవాలి: పి.రవి

విద్యార్థి దశలోనే చట్టాల గురించి తెలుసుకోవాలి:  పి.రవి

కాగజ్‌నగర్‌, వెలుగు: విద్యార్థి దశలోనే చట్టాలు, న్యాయవ్యవస్థ గురించి అవగాహన పెంచుకోవాలని సిర్పూర్ టీ జూనియర్ సివిల్ జడ్జి పి.రవి సూచించారు. మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కాగజ్ నగర్​లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. చీఫ్​గెస్ట్​గా హాజరైన జడ్జి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే రాజ్యంగంలోని వివిధ అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. 

ప్రతి ఒక్కరూ చట్ట పరిధిలో ఉంటూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉపయోగించుకోవాలన్నారు. ఇటీవల విడుదలైన పీజీ ప్రవేశ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన పలువురు స్టూడెంట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి గణపతి,లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ సతీశ్ కుమార్, లోక్ అదాలత్ సభ్యుడు కల్యాణ్, కాలేజ్ ప్రిన్సిపాల్ డా.లక్ష్మీనరసింహం, అధ్యాపకులు పాల్గొన్నారు.