సూర్యాపేట, వెలుగు: స్టూడెంట్లు లక్ష్యం పెట్టుకొని చదవాలని ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాస రాంకుమార్ రెడ్డి సూచించారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుధాకర్ పీవీసీ లిమిటెడ్ సౌజన్యంతో ఆదివారం జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులకు నోట్ బుక్స్ అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ అధ్యక్షులు ఉప్పు నాగయ్య, బత్తుల దామోదర్ రెడ్డి, రుద్రంగి కాళిదాసు, ప్రిన్సిపాల్స్ శమంతక మణి, చారి, హెచ్‌ఎం వెంకటయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.