స్కూల్​ లెవెల్ నుంచే సైంటిస్టులుగా తీర్చిదిద్దాలి

స్కూల్​ లెవెల్ నుంచే సైంటిస్టులుగా తీర్చిదిద్దాలి
  • హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: స్కూల్​లెవెల్​నుంచే స్టూడెంట్స్​ను భావి శాస్త్రవేత్తలు గా తీర్చిదిద్దాలని టీచర్లకు హైదరాబాద్​కలెక్టర్​అనుదీప్​సూచించారు. రాంనగర్ సెయింట్ పాయిస్​ఎక్స్​స్కూల్​లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు కలెక్టర్​హాజరయ్యారు. 

తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్​ప్రారంభించి తిలకించారు. 6 నుంచి10 వ తరగతి చదువుతున్న 78 మంది స్టూడెంట్స్​147 వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓ చిరంజీవి, ప్రిన్సిపాల్ సిస్టర్ లిండా జరాల్డ్, కోఆర్డినేటర్ జ్యోతి, తహసీల్దార్ రాణాప్రతాప్ సింగ్ పాల్గొన్నారు.