శ్రీ చైతన్య స్కూల్లో ఘోరం: రక్తపు వాంతులు చేసుకున్న స్టూడెంట్స్.. ఏం జరిగిందంటే..

హైదరాబాద్ లోని చింతల్ లో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో ఘోరం జరిగింది.. విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకొని ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీ చైతన్య కాలేజీ బిల్డింగ్ మూడవ అంతస్తులో గల బాత్ రూంలో యాసిడ్ కింద పడింది. ఆ ఘాటుకు విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకున్నారు. ఈ ఘటనలో సుమారు 50మంది స్టూడెంట్స్ అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది.

చాలామంది విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన యాజమాన్యం.. తల్లి తండ్రులకు తెలీకుండా హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే.. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించి చికిత్స అందించటంతో పిల్లలకు ప్రాణాపాయం తప్పింది. ఎట్టకేలకు తల్లిదండ్రులకు విషయం తెలియడంతో స్కూల్ దగ్గరకు చేరుకొని ఆందోళన చేపట్టారు తల్లిదండ్రులు.

ALSO READ : వీకెండ్ కల్లు పార్టీ కోసం.. కారులో వెళుతుంటే.. ఐదుగురు హైదరాబాద్ కుర్రోళ్లు మృతి

లక్షల్లో ఫీజులు కట్టి తమ పిల్లలను స్కూల్లో జాయిన్ చేస్తే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ నిలదీస్తున్నారు పిల్లల పేరెంట్స్. కాలేజీ యాజమాన్యం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్. తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడంతో హుటాహుటిన స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ను ఇంటికి పంపారు స్కూల్ సిబ్బంది.