
- స్కూళ్లు స్టార్టయి 15 రోజులైనా అందని నోట్స్
- 15 రోజుల్లో పూర్తిస్థాయిలో అందిస్తామంటున్న అధికారులు
- హోమ్‌వర్క్ పెండింగ్ పడుతోందంటున్న స్టూడెంట్లు
మంచిర్యాల, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో ఆరో తరగతినుంచి ఇంటర్‌వరకు చదువుకుంటున్న స్టూడెంట్లకు నోట్ బుక్స్ ఇంకా అందలేదు. జిల్లా వ్యాప్తంగా 2.57 లక్షల నోట్స్ అవసరం కాగా, ఇప్పటివరకు 59 వేలు మాత్రమే వచ్చాయి. వాటిని మండలాలకు సప్లై చేశారు. ఇంకా సుమారు 2 లక్షల నోట్స్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. స్కూళ్లు స్టార్టయి 15 రోజులు అవుతున్నా నోట్ బుక్స్ అందకపోవడంతో హోంవర్క్ పెండింగ్ పడుతోందని వాపోతున్నారు. అత్యవసరమైన కొన్ని నోట్స్ ను ప్రైవేట్ లో కొనుక్కుంటున్నామని చెబుతున్నారు. .
సిక్త్స్ క్లాస్టు ఇంటర్ఫ్రీ నోట్స్....
గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకుంటున్న స్టూడెంట్లకు ఇప్పటికే టెక్ట్స్‌బుక్స్, యూనిఫామ్స్ ప్రభుత్వం సప్లై చేస్తోంది. ఇదే రీతిలో నోట్ బుక్స్ కూడా అందజేయాలని నిర్ణయించింది. ఆరు నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారికి ఆయా క్లాస్‌లకు అవసరమైన నోట్స్అందిస్తోంది. సిక్త్స్క్లాస్కు ఆరు, ఏడు, ఎనిమిదిక్లాస్లకు 7 చొప్పున, తొమ్మిది, పది క్లాస్‌లకు 14 చొప్పున నోట్బుక్స్రావాల్సి ఉంది. మోడల్ స్కూల్స్, కేజీబీవీల్లో ఇంటర్ చదువున్న వారికి నోట్బుక్స్అందిస్తున్నారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్లలో ఎంపీపీ, బైపీసీ, సీఈజీ, ఎంఈసీ తదితర గ్రూపుల స్టూడెంట్లకు 12 చొప్పున, ఎంపీహెచ్ డబ్ల్యూ, ఇతర వొకేషనల్ కోర్సులు చదువుకుంటున్న వారికి 10 చొప్పున ఇవ్వనున్నారు. ఇందులో టెన్త్‌క్లాస్ వరకు 200 పేజీల సింగిల్ రూల్, ప్లెయిన్ నోట్స్ అవసరం. ఇంటర్లో అన్ని గ్రూపుల విద్యార్థులకు 200 పేజీల ప్లెయిన్ నోట్స్ఇవ్వనున్నారు.
హోమ్ వర్క్ పెండింగ్...
సమ్మర్ హాలీడేస్తర్వాత ఈ నెల 12న స్కూళ్లను రీ ఓపెన్ చేశారు. అంతకుముందే టెక్ట్స్‌బుక్స్ అన్ని మండలాలకు సప్లై చేయడంతో స్కూళ్లు స్టార్ట్ కాగానే వాటిని స్టూడెంట్లకు పంపిణీ చేశారు. ఇప్పటికే సిలబస్ స్టార్ట్ కావడంతో అత్యవసరమైన నోట్స్‌ను ప్రైవేట్‌లో కొనుక్కున్నామని విద్యార్థులు చెబుతున్నారు. క్లాస్‌లో టీచర్లు చెబుతున్న అంశాలను రఫ్ నోట్స్‌లో రాసుకుంటున్నామని పేర్కొంటున్నారు. నోట్‌బుక్స్ రాకపోవడంతో హోమ్‌వర్క్ పెండింగ్పడుతోందని అంటున్నారు. నోట్స్రావడానికి మరో 15 రోజులు పడుతుందని చెబుతున్నారని, త్వరగా అందించాలని కోరుతున్నారు.